–నల్లగొండ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదిక చర్యలు
–ప్రారంభించిన టౌన్ కాంగ్రెస్ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
–పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు
Press Club Office: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జర్నలిస్టుల సంక్షేమం కో సం ఏర్పాటైన నూతన ప్రెస్ క్లబ్ కా ర్యాలయం ((Press Club Office)ను నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మో హన్ రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్ (Abbagoni Ramesh Goud)ప్రారం భిం చారు. నూతనంగా ప్రెస్ క్లబ్ అధ్య క్షులు గా ఎన్నికైన పులి మామిడి మహేందర్ రెడ్డి కి,ప్రధాన కార్య దర్శి గాదె రమేష్ కి అలాగే ప్రెస్ క్లబ్ పాలక వర్గానికి,సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్, జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షు డు గుండగోని జయశంకర్ గౌడ్ (Gundagoni Jayashankar Goud) అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమం లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్య క్షు లు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లా డుతూ ప్రభుత్వం నుండి అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) నుం డి పూర్తి సహకారం జర్నలిస్టుల కు ఉంటుంది అని అలాగే మీ సమ స్యలు పరిష్కారం కోసం మేము ప్ర త్యేక దృష్టితో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభు త్వానికి వారధి లాగా పని చేయాలని కోరా రు.
తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన జర్నలిస్టులకు (Journalists)గత ప్రభుత్వంలాబ్ ఇళ్ల స్థలాల కో రిక అందని ద్రాక్ష లాగే మిగిలిపో యిందని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వ ర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభు త్వంలో జర్నలిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫలాలు తప కుండా అందుతాయని అన్నారు. దాదాపు ఒక ఏడాది లోనే అర్హులైన జర్నలి స్టులు అందరికీ ఇళ్ల స్థలాలు, నిర్మా ణం కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపు, జర్నలిస్టులకు వేదిక గా ఉండే ప్రెస్ క్లబ్ (Press Club) నిర్మాణానికి మం త్రి కోమటిరెడ్డి సహకారంతో సం పూర్ణ సహకారం ఉంటుందని ఆ యన అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో అర్హులైన జర్నలిస్టుల జా బితాను సిద్ధం చేయాలని, ఆ జాబితా కూ డా పూర్తి పారదర్శ కతతో చేయా లన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టు లు పనిచేయా ల్సిన బాధ్యత ఉంద న్నారు. నిజా న్ని నిర్భయంగా వెలికి తీసే జర్న లిస్టులకు (Journalists)ఎప్పుడు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిప ల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ (Abbagoni Ramesh Goud) మా ట్లాడుతూ ప్రజల సమస్య లు పరిష్కారం కి మంచి వేదికను ఏర్పాటు చేయడం శుభ సూచికం అన్నారు.అలాగే జర్నలిస్ట్ ల సమ స్యలు కూడా మంత్రి దృష్టిలో ఉ న్నాయని వాటిని కూడా పరిష్కా రం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఏండ్ల తరబడి ఉన్న స మస్యలు తొందరలోనే పరిష్కారం అవుతాయని తెలిపారు.ఈ కార్య క్రమంలో అధ్యక్షులు పులిమామిడి మహేందర్,ప్రధాన కార్యదర్శి గాదె రమేష్, ఐబీసీ అధినేత ఏచూరి భా స్కర్, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచా ర్జ్ సాంబశివా రెడ్డి, ఎలక్ట్రాన్ మీడి యా అధ్యక్ష కార్య దర్శులు వెంక టరెడ్డి సల్వాది జానయ్య, సివిఆర్ ఇంఛార్జి బ్యూరో ఇంఛార్జి వెంకట్ రెడ్డి, వార్త ఇంఛార్జి వీర స్వామి. కోశాధికారి దండంపెల్లి రవికుమా ర్, క్రీడల కార్యదర్శి మధు, కంది బజరంగ్ ప్రసాద్, మల్లికార్జున్ ఎస్ కె సలీం, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.