–పత్రికల సమస్యల సాధనకు టీఎస్ఎండిపిఏ విలీనం
–చిన్న పత్రికల ప్రతినిధులు యూ సుఫ్ బాబు, మాతంగి దాస్
Problems of small magazines: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఐక్యత తోనే చిన్న పత్రికల మనుగడ సాధ్యమని తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు (Yusuf Babu), తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరి యాడికల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు, ఐజేయూ జాతీయ కౌన్సిల్ స భ్యులు దాస్ మాతంగిలు అన్నారు. చిన్న పత్రికల సమస్యల (Problems of small magazines) పరిష్కారం కోసం ఐక్యత చాటుదామని పిలు పునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో సంఘం గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం అ ధ్యక్షతన జరిగిన తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘం సమావేశంలో ముఖ్య అతి థులుగా హాజరై ప్రసంగించారు. చిన్న మధ్యతరహా పత్రికల కొత్త ఎంపానల్ మెంట్, అక్రిడి టేషన్, అప్ గ్రేడ్, ఇళ్లు, ఇళ్ల స్థలాల సమ స్యల సాధనకు సమిష్టి కృషి చేద్దా మన్నారు.
దిన పత్రికలకు ప్రతి నెల రెగ్యులర్ యాడ్స్ కు తోడు మ్యాగ జైన్స్ (Magazines)కూడా వచ్చేలా కృషి చేయా ల్సిన అవసరం ఉందని అన్నారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2018 తదు పరి దిన పత్రికల అప్ గ్రేడ్ పెండింగ్ (Upgrading of dailies is pending)ఉందని, ఉన్నతాధికారులు, ప్రభు త్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించేందుకు ప్రణాళిక బద్దంగా వ్యవ హరిస్తామన్నారు. తాజాగా ఇచ్చిన హైకోర్ట్ తీర్పు మేరకు ఎబీసీడి క్యా టగిరి విషయమై తదుపరి ప్రత్యా మ్నాయ పారామీటర్స్ అందరికి అనువుగా ఉండేలా కృషి చేస్తా మన్నారు. నాన్ హౌజింగ్ సొసైటి, చిన్న పత్రికల హౌజింగ్ (Non housing society, small magazine housing) సొసైటితో ఇళ్ల స్థలాల సమస్యలకు చెక్ పెడ తామన్నారు. ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీల సారథ్యంలో ఆయా సమస్యల సాధనకు సమిష్టి కృషి చేస్తామన్నారు. టియూడబ్ల్యూజే – ఐజేయూ అధినేతల సూచనల మేరకు చిన్న పత్రికల మనుగడకై తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, పిరియాడికల్స్ సంఘాన్ని విలీనం చేసేందుకు సమిష్టి నిర్ణయం తీసు కున్నా మన్నారు.
ఆయా సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరుకు సిద్ద మన్నారు. తెలంగాణ చిన్న మధ్య తరహా దిన మాస పత్రికల సంఘం (Association of Daily and Monthly Magazines)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాతాకు ల అశోక్ మాట్లాడుతూ చిన్న పత్రిక ల సమస్యల సాధనకు అవిశ్రాం తంగా కృషి చేస్తామన్నారు. అనం తరం సంఘ పెద్దలకు శాలువాలతో ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహమ్మద్ అలీ, కల కొండ రామకృష్ణ, కొమరాజు శ్రీనివా సులు, కోటగిరి చంద్ర శేఖర్, చాకి రేవు వెంకటయ్య, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎండి మక్సు ద్, పేర్ల వెంకటయ్య , టీయస్ఎం డిపిఏ వైస్ ప్రెసిడెంట్ చిట్యాల శ్రీనివా సరావు, కోటగిరి రామకృష్ణ, సోమవరపు యాదయ్య, భూపతి రాజు, భూపతి లక్ష్మీనారాయణ, ఎండి ఆసిఫ్ అలీ, వీరెల్లి సతీష్ , వీరెల్లి రమణ, ఎండి. అఫ్జల్ ఖాన్, తిరుమణి శ్రీనివాస్, ఫోటో నాగే శ్వరరావు, షౌకత్ అలీ, గఫూర్, షరీఫ్ బాబు, సయ్యద్ పాష, జెల్లా నాగరాజు, ఇమ్మడి సందీప్ యాదా ప్రవీణ్, ఎఎన్ చారి, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.