Gopal reddy Retirement: నల్లగొండ నేలను ఎప్పటికీ మరువలేను
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా అభివృద్ధి పదంలో నడిపి పదవీ కాలాన్ని పూర్తి చేసు కున్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డికి సిబ్బంది కళాశాలల యాజ మాన్యాలు ఘనంగా వీడ్కోలు పలికారు.
వీడ్కోల సభలో ఎంజియూ ఉప కులపతి ఆచార్య గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University)ఉప కులపతిగా అభివృద్ధి పదంలో నడిపి పదవీ కాలాన్ని పూర్తి చేసు కున్న ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డికి(Gopal Reddy) సిబ్బంది కళాశాలల యాజ మాన్యాలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన వీడ్కోల సమావేశం లో సిబ్బంది కళాశాలల యాజమా న్యాలు ఆచార్య గోపాల్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వారి సేవలను కొనియాడారు. అనంతరం గోపాల్ రెడ్డి దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండతో(Nalgonda) తన అనుభవాన్ని పంచుకున్నారు, పీజీ సెంటర్ అధ్యాపకుడిగా ప్రారంభించిన తన ప్రస్థానం అత్యున్నత అకాడమిక్ పదవైన ఉపకులపతి సైతం నల్లగొండతోనే ముడి పడటం యాదృచ్ఛికం అత్యంత అదృష్టంగా భావిస్తా అన్నారు. కర్మభూమి నల్లగొండ జిల్లా ఆదరణ ప్రేమాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అభివృద్ధికి అన్ని సానుకూలతలు ఉన్నట్లు, సిబ్బంది కొరత అధిగమించి కొత్త కోర్సులను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోనే ఉన్నత విద్యలో అగ్రగామిగా నిలవచ్చునన్నారు.
త న ప్రస్థానంలో జరిగిన నాక్ ర్యాంకు అప్గ్రేడేషన్ , నూతన భవనాల ప్రారంభం, స్నాతకోత్సవం, అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్(Advancement)తదితర నిర్ణయాల్లో సిబ్బంది పాలకమండలి సభ్యుల చొరవ సహాయ సహకారాలు మరువలేని అన్నారు. రాబోవు రోజుల్లో ఉష మరియు రూస నిధులతో నూతన హాస్టల్స్ భవనాలు మరియు పరిపాలన భవనాలకు సైతం అనుమతులు పొందినట్లు తెలిపారు. వ్యవస్థ కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ శ్రద్ధాశక్తులతో సంస్థ ఉన్నతికి తోడ్పడాలని సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వక అనుబంధం ఎన్నో గుణాత్మకమైన మార్పులకు బాట వేస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఈ మూడేళ్ల పదవి కాలంలో తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఓ ఎస్ డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి(Anji Reddy)అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, ఎంవి గోన రెడ్డి, కృష్ణారెడ్డి, కంట్రోలర్ డా జి ఉపేందర్ రెడ్డి, దోమల రమేష్, ప్రేమ్ సాగర్ మద్దిలేటి, అరుణప్రియ, సుధారాణి, మిరియాల రమేష్, డా వై ప్రశాంతి, ఆకుల రవి, సూర్యనారాయణ రెడ్డి, రేఖ, అన్నపూర్ణ, తదితర అధ్యాపకులు, విద్యార్థులు, నేషనల్ ఎలక్షన్ వాచ్ ప్రెసిడెంట్ డా బొమ్మరబోయిన కేశవులు పాల్గొన్నారు.
professer Gopal reddy says forget nalgonda