–నల్లగొండ అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర
Purṇa candra: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి స మాజానికి ఆదర్శమని స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చం ద్ర (Purṇa candra)అన్నారు.కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతిని పురస్కరించు కొని శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) విగ్ర హానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భం గా ఆయన మాటస్ఫూర్తి తెలం గాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని త్రుణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బా పూజిది అని అన్నారు. కొండ లక్ష్మ ణ్ బాపూజీ మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్ట పడి చదివి పైకి వచ్చారని తెలి పారు. కొండ లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) క్రమ శిక్షణ అందరికీ ఆదర్శమని , ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ నిరూపించారని అన్నారు.మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ ,బీసీ సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా కొండ లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji)పై తడక యాదగిరి రచించిన పుస్తకాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విడుదల చేశారు. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై కొండ లక్ష్మణ్ బాపూజి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను కొనియాడారు.