Purnachandra: ప్రజా దీవెన నల్లగొండ: ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల (LRS applications) ను క్షేత్రస్థాయిలో తనికి నిర్వహించి జాగ్రత్తగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర అన్నారు. ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల (LRS applications) పరిష్కారం పై శిక్షణ లో భాగంగా ఈ నెల 14 న జిల్లాలోని (15 )మండల బృందాలకు శిక్షణ ఇవ్వగా,శుక్రవారం తక్కిన మండల బృందాలకు శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (Additional Collector)మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారాని కై శిక్షణ పొందిన బృందాలన్నీ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా దరఖాస్తులను పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల్లో స్థాయిలో సందర్శించి నియమ నిబంధనలన్ని సక్రమంగా పాటించి దరఖాస్తులను పరిష్కరించాలని, దరఖాస్తుల పరిష్కారంలో సందేహం వచ్చినట్ల యితే ఉన్నతాధికారులను (superiors) సంప్ర దించాలని కోరారు.జిల్లా పంచా యతీ అధికారి మురళి, డిటిసిపి లక్ష్మీనారాయణ, డి ఎల్ పి ఓ లు,తహసిల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు,ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు , ఎంపీఓలు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.