–అందరికీ పోషకాహారం’పై అవగా హన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర
Purnachandra: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : ఆహారపు అలవాట్లలో మార్పులు, చైతన్యంతోనే సమాజంలో పోషకా హార లోపాన్ని అరికట్టవచ్చని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర (Purnachandra)పేర్కొన్నారు. జాతీయ పోషకాహార మాసోత్సవం సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) (cbc)ఆధ్వర్యంలో ‘అందరికీ పోషకాహారం’పై నల్గొండ లో నిర్వహిస్తున్న మూడు రోజుల సమగ్ర సమాచార, అవగాహన కార్యక్రమం రెండవ రోజున గర్భిణులు, బాలింతలు, యువతులు పాల్గొన్నారు. ఈ సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు, స్థూల-సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం, ఆహారంలో పోషక వివరాలను (Nutritional details) గుర్తించే విధానం వంటి అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టరు మాట్లాడుతూ, ‘’వైవిధ్యభరితమైన మన పోషకాహార అంశాలపై అవగాహనతో కూడిన సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయడం ఒక సవాలు” అని అన్నారు.
ఈ సవాళ్లను పరిష్కరించి పోషకాహారంపై సామాజిక మార్పు తేవడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని (Poshan Abhiyan) ఆయన అన్నారు. ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న సాంప్రదాయ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలలో రక్త హీనత నివారణతో పాటు, మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది అన్నారు. సమాజం అభివృద్ధి కేవలం ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక, మానసిక శ్రేయస్సు మిళితమై ఉందన్నారు. ఆరోగ్యకరమైన (Healthy)సమాజాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లీబిడ్డల ఆరోగ్య విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అరుంధతి గర్భిణులు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రతలు వివరించారు. సమతుల ఆహారంతో పోషకలోపాన్ని అధిగమించ వచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళా, శిశు సంక్షేమ పథకాలను వివరించారు.
అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు (Collective Seemanthas) నిర్వహించగా అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక ఆహార వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి విభాగ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.