Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Qaza Altaf Hussain: పరిశోధనలు సంక్లిష్టతలను సావకాశాలుగా మార్చే సమాజ హితైషి సాధనాలు

— ఎంజియు ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
ప్రజా దీవెన నల్లగొండ: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించిన పది రోజుల రిసర్చ్ మెథడాలజీ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా ఉపకులపతి హాజరై సభికులను ఉద్దేశించి ప్రసంగిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనేజ్మెంట్ విభాగం జాతీయస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం, జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థల నుండి అధ్యాపకులను పరిశోధకులను భాగస్వాములను చేయడం ద్వారా ఎం జి యు ప్రతిష్ట పెంచారన్నారు. శిక్షకులలో 35% స్థానిక అధ్యాపకులు ఉండడం గర్వ కారణం, జాతీయ స్థాయిలో జరిగే ఏ కార్యక్రమానికైనా విలువైన మానవ వనరుల అధ్యాపకుల సమూహం ఉన్నట్టుగా భావించాలన్నారు.

సంక్లిష్టతలను సానుకూలతలుగా మార్చే సమాజ హితేషి సాధనాలుగా పరిశోధనలు ముందుకు సాగాలని సూచించారు. పది రోజుల పరిశోధనాల శిక్షణ కార్యక్రమం అందించిన జ్ఞానo తో ప్రతి ఒక్కరూ నాలుగు పరిశోధన పత్రాలను ప్రామాణిక జర్నల్స్ లో ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలను నిశితంగా పరిశీలిస్తూ సమ్మిళిత సమాజం కొరకు పరిశోధనలు సాగినప్పుడు శిక్షణ కార్యక్రమాలకు నిజమైన సార్థకతగా భావించాల్సి ఉందన్నారు. ఎం జి యు “సా విద్యయ విముక్తయే”.. అనే సామాజిక బాధ్యత ను ముందుకు నడిపే సాధనాలుగా పరిశోధనలుజరగాలని ఆకాంక్షించారు.

రిజిస్ట్రార్ మరియు కోర్సు కోఆర్డినేటర్ ఆచార్య అలువాల రవి మాట్లాడుతూ జాతీయస్థాయి కార్యక్రమం ప్రేరణగా మరిన్ని కార్యక్రమాలను రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం కోర్సు కోఆర్డినేటర్ మిరియాల రమేష్ పది రోజుల శిక్షణ కార్యక్రమాలలో చర్చించిన అంశాలను వివరించారు. గనాత్మకమైన పరిశోధనలు, అకాడమిక్ రైటింగ్ పరిశోధన పత్రాల ప్రచురణలు అధునాతన సాంకేతిక పద్ధతులన్నిటిని వివరించేలా 32 సెషన్లలో జరిగిన కార్యక్రమం ద్వారా పరిశోధన రంగంలో విలువైన మానవ వనరులను దేశానికి అందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, డా మిరియాల రమేష్, డీన్ ఆచార్య సరిత, ప్రిన్సిపాల్ డా మారం వెంకట రమణారెడ్డి, డా లక్ష్మీప్రభ, డా సబీనా హెరాల్డ్, డా సూరం శ్వేత, డా జక్కా సురేష్ రెడ్డి తదితర అధ్యాపకులు దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు అధ్యాపకులు పాల్గొన్నారు.