Nomination : కదంతొక్కిన కాంగ్రెస్ క్యాడర్
నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.
నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘు వీర్ నామినేషన్ కు భారీగా పార్టీ శ్రేణులు
మంత్రులు వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి ల హాజరు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్(Congress) పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్(Nomination)కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. తొలుత వీటి కాలనీలోని దేవాలయంలో పూజలు నిర్వహిం చిన అనంతరం భారీ ర్యాలీ గా బయలుదేరి వెళ్లారు.
ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ, పౌర సరఫరల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్డు భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివ ర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkata Reddy), మాజి మంత్రివర్యులు కుందూరు జానా రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, శాసనసభ్యులు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, మద్దత్తు ప్రకటించిన సిపిఐ, సిపిఎం నాయకులు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్, జడ్పీటీసీ లక్ష్మయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్ లు మహిళా నాయకురాలు సర్పంచ్ లు ఎంపీటీసీ లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Raghuveer reddy nomination in Nalgonda