Raghuveer Reddy: నల్లగొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి
నల్లగొండ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఘన విజయం సాధించారు.
5లక్షల 52 వేల 659 భారీ మెజార్టీ తో ఘన విజయం
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ(Nalgonda) పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy) ఘన విజయం సాధించారు. తొలి రౌండు నుంచి ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తున్నారు రఘువీర్ రెడ్డి పోలింగ్ పూర్తయ్యే సరికి 5 లక్షల 52 వేల 659 భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి(Sanampudi Saidireddy) శానంపూడిపై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎంపిగా ఎన్నికైన రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే భారీ మెజారిటీ ఇచ్చిన నల్గొండ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.
భారీమెజారిటీ కోసం నాయకులు, కార్యకర్తలు నా విజయం కోసం పని చేశారని, బీఆర్ఎస్(BRS) పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు అసెంబ్లీలో(Assembly)పట్టం కట్టారని చెప్పారు. ఆరు నెలల కాంగ్రెస్ పాల నను ప్రజలు నమ్మి నన్ను ఆశీర్వదిం చారని, నాకు ఇచ్చిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం(Nalgonda Parliamentary Constituency)కోసం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.డిండి, బ్రాహ్మణ వెల్లంల పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పని చేస్థానని, ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని, ఒమ్ము చేయకుండా అందరితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.
Raghuveer reddy win in nalgonda parliament