–నాలుగు తులాల బంగారు ఆభర ణాలు, పదివేల నగదు దొరకడంతో ఊపిరి పీల్చుకున్న బాధితురాలు.
–మానవత్వంతో దొరికిన బ్యాగు ను అందజేసిన వ్యక్తిని సన్మానిం చిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి
Raja Shekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని సావర్కర్ నగర్ కి చెందిన గోగీకర్ పద్మావతి అనే మహిళ ప్రకాశం బజార్ లోని సాయి బేకరీకి (Sai Bakery) వచ్చి, బ్యాంకుకు వెళుతున్న సమయంలో తన చేతిలో ఉన్న బ్యాగును రోడ్డు మీద పడిపోయింది, అది చూసు కొకుండా ఆమె వెళ్ళిపోయింది. అదే సమయంలో దానిని గమనిం చిన సాయి ఆర్టికల్స్ షాప్ యజ మాని బిక్షాల యాదగిరి తన షాపుకు వచ్చిన కస్టమర్ సహాయంతో బ్యాగును (bag)భద్రపరచడం జరిగింది.
బాధితురాలు ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ (bag) చూసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వెంటనే క్రైమ్ సిబ్బంది శ్రీకాంత్ ను పంపి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ చుట్టుపక్కల వారిని విచారిస్తున్న సమయంలో, సాయి ఆర్టికల్స్ షాప్ యజమాని బిక్షాల యాదగిరి భద్రపరిచిన బ్యాగును బాధితురాలికి చూపించగా, అనంతరం, అందులో ఉన్న నగదు, బంగారం సరిగా ఉన్నందున సదరు యాదగిరికి, త్వరితగతిన స్పందించిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్ (Inspector Rajasekhar)గారికి, క్రైమ్ సిబ్బంది శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి చేతుల మీదుగా బ్యాగ్ ను తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా సాయి ఆర్టికల్స్ షాప్ (Sai Articles Shop)యజమాని యాదగిరిని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మానవత్వంతో ప్రతి ఒక్కరు ఆలోచించాలని, ఎవరైనా ఇతరులు వారి వస్తువులను పోగొట్టుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ లో అందజేయాలని, భాదితులకి బాధ్యతగా వారి వస్తువులని తిరిగి అందజేస్తున్నట్లయితే కలిగే సంతృప్తి ఎంతో గొప్పదని తెలియజేశారు.