–వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి
Rajasekhar Reddy; ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ (Commemoration of Police Martyrs) వారోత్స వాలలో భాగంగా బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమంను ఇన్స్పెక్టర్ రాజశేఖ ర్ రెడ్డి (Rajasekhar Reddy) నిర్వహించారు. నల్లగొండ పట్టణం లోని ప్రేరణ స్కూల్ (Prerna School) విద్యా ర్థులకు పోలీస్ స్టేషన్ లో జరిగే విధులు, రికార్డులు, మరియు పరికరాల పై అవగాహన కల్పిస్తూ, ప్రతి ఒక్క పౌరుడు యూనిఫాం లేని పోలీస్ లాగా నేర రహిత సమాజానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లు సందీప్ రెడ్డి , శంకర్, సిబ్బంది సుదర్శన్ కిరణ్ శివరామకృష్ణ కృష్ణా నాయక్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.