–నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
Rajasekhar Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, సందీప్, సురేష్ లతో (DSP Sivaram Reddy, CI Rajasekhar Reddy, SIs Shankar, Sandeep, Suresh) పాటు సిబ్బంది పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉం చుకుంటూ పచ్చదనం పెంచే విధం గా మొక్కలను నాటి రక్షించాలని డీఎస్పీ శివరాం రెడ్డి (DSP Sivaram Reddy)తెలిపారు. అలాగే ప్రజలందరూ రేపటి భవిష్య త్తుకు ఈరోజు మనం నాటే మొక్క ల మీద వాటి సంరక్షణ మీద ఆధా రపడి ఉంటుందని అన్నారు.ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతగా మొక్క లు నాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, హోంగార్డులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.