Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rakshabandhan: వృక్షానికి రాఖీ కట్టు మానవాళికి అదే ఆయువుపట్టు

Rakshabandhan:ప్రజా దీవెన, నల్లగొండ: రాఖీ పండుగ రోజు ఆడపడచులు అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టి రక్షాబంధన్ (Rakshabandhan) గా కష్టసుఖాలలో తోడు నీడై అండగా వుండాలని కోరుకుంటారో ఆ క్రమంలోనే రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో రాఖీ పండుగ రోజు చె ట్టుకు రాఖీ కట్టి వృక్షా బంధన్‌ను నిర్వహించి వృక్షానికి బొట్టు పెట్టి రాఖీ (rakhi) కట్టడం జరిగింది. అనంతరం సామాజిక కార్యకర్త వేముల సైదు లు పాల్గొని మాట్లాడుతూ ప్రకృతి లో మమేకమైన మనిషికి వృక్షాలు అన్నలా అండగా వుండెలా స్వచ్ఛ మైన గాలితో పాటు పండ్లు ఫలాలు అందరికీ ఉపయోగపడుతూ ప ర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్ల ను మనిషి అభివృద్ధి పేరిట నరికే స్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గుర వుతున్నాడు.

చెట్లు (tree)లేకపోతే జరిగే నష్టాన్ని నేడు రక్షా బంధన్‌ను వృక్షా బంధన్‌గా నిర్వహించడం ప్రతీ ఒక్క రు పర్యావరణ పరిరక్షణ లో భాగం గా చెట్టుకు రాఖీ కట్టు (rakhi) మానవాళికి అది అయుపట్టని గుర్తించాలన్నా రు. నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం పకృతి మాతాకీ రక్ష అనే నినాదంతో పకృతితో సహోదర సం బంధాన్ని పెంచుకుందాం పర్యావ రణ పరిరక్షణ కోసం కృషి చేద్దామని వాతావరణ మార్పులకు అనుగు ణంగా అనుసరిద్దాం అనే లక్ష్యంతో రక్ష బంధన్‌ను వృక్షా బంధన్‌గా (Rakshabandhan)) జరుపుకుంటూ పర్యావరణ పరి రక్షణకు తమ వంతుగా ప్రతి ఒక్క రు ఇలా చేస్తే మరింతగా ప్రకృతి బంధం బలపడతుందని ఇలాంటి మంచి కార్యక్రమలు కార్యక్రమాలు చేయుటకు యువత ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ముసోజు నవీన్ కుమార్, కొత్తగట్టు స్వాతి , వేముల తేజస్వి, అక్షిత, తనుష్, శివరాం , వరల క్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.