ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : గణితంతో లాజికల్ థింకింగ్ అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ విశ్వావిద్యాలయం గణితశాస్త్ర విభాగాధిపతి డా. పసుపుల మద్దిలేటి అన్నారు. శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణితశాస్త్ర మేధావి రామానుజన్ జన్మదినం సందర్బంగా జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బగా ముఖ్య అతిథిగా హాజరైన మద్దిలేటి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు గణితశాస్త్రం యెడల మక్కువను పెంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని, గణిత శాస్త్రాన్ని అభ్యసించడం వలన విద్యార్థులలో లాజికల్ థింకింగ్ పెంపొంద బడి భవిష్యత్తులో మంచి స్థానాలకు చేరుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా మంచి ఉపాధిని పొందవచ్చునని తెలియజేశారు.
ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా తల్లిదండ్రుల యొక్క మన్ననల్ని పొందాలని సూచించారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు మంచిగా నిర్మించుకొని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఎప్పటికీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మరవద్దని తెలియజేశారు. శ్రీనివాస రామానుజన్ అనేక కష్టనష్టాలకు ఓర్చి ఆనాటి పరిస్థితులను ఎదుర్కొని పంచవ్యాప్తంగా ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులుగా పేరుపొందారని వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వృద్ధిలోకి రావాలని సూచించారు.
కార్యక్రమంలో స్వయంగా గణిత అధ్యాపకులైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ గారు పాల్గొని పుస్తక పఠనం ద్వారా గణిత శాస్త్రాన్ని లోతుగా అభ్యసించాలని తెలియజేశారు . పరీక్ష సమయంలోనే కాకుండా ప్రతి నిత్యము అభ్యసనం చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి స్థానాన్ని పొంది మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి బత్తిని నాగరాజు, IQAC కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్న కుమార్, గణితశాస్త్ర విభాగం ఇంచార్జీ అధ్యక్షులు ఎం. వెంకట్ రెడ్డి, అధ్యాపకులు డి. మధుకర్, సి.కె. రజని, కె. కనకయ్య, మహేష్, విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు.