Ramaraju Yadav: ప్రజా దీవెన, నల్గొండ టౌన్:బిజెపి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన వేడుకలు సందర్భంగా నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ పిల్లి రామరాజు యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు..
ఈ కార్యక్రమంలోగుండెబోయిన సురేష్ యాదవ్, అల్లి సతీష్ యాదవ్, చల్లా కోటేష్ యాదవ్,కుంటిగొర్ల లింగయ్య యాదవ్,కొప్పు సంతోష్ గౌడ్, భీమనవోని సైదులు యాదవ్, సింగం రమేష్, బోడ వంశీ యాదవ్, తొలిచూరి శంకర్ యాదవ్, నూర్ మహమ్మద్, జానపాటి శంకర్ యాదవ్, నడ్డి శంకర్ యాదవ్, పల్లె శ్రీకాంత్ యాదవ్, మణి యాదవ్, మల్లె పోయిన సతీష్ యాదవ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.