Ravula Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: శ్రీ కనకదుర్గ అమ్మవారి (Goddess Kanakadurga) చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాల తో తులతూగాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి (Ravula Srinivas Reddy)అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 13వ వార్డులో ఎన్టీఆర్ కాలనీయూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనక దుర్గ దేవి విగ్రహం వద్ద 1000 మం దికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్య క్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీఆర్ కాలనీ యూ త్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Devi Sharannavaratri celebrations)నిర్వ హించడం అభినందనీయ మన్నా రు.
దుబాయ్ శ్రీనివాస్- ఉమా దంపతులు (Dubai Srinivas-Uma couple) 1000 మందికి అన్నదానం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని కోరుతూ వార్డు ప్రజలకు దసరా శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉట్కూరు వెంకట్ రెడ్డి, హరి, రాజు, లింగస్వామి, శ్రీరామ్, సాయిరాం, నరేష్, సందీప్, రవి, అజయ్, విజయ్, వీరేష్, శివ, అవినాష్, సత్యనారాయణ యాదమ్మ,అన్నపూర్ణ, ధనమ్మ, సుగుణమ్మ, మహేశ్వరి, రేణుక, అండాలు, పుష్పలత, మాధవి, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
