— విశ్రాంత ఉద్యోగుల సమూహిక జన్మదిన వేడుకలు: సీతారామయ్య.
Retired Employees: ప్రజా దీవెన, కోదాడ: విశ్రాంత ఉద్యోగులు (Retired Employees) సమస్యలకు దూరంగా ఉంటూ వృద్ధాప్యాన్ని (old age) సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల. సీతారామయ్య (Sitaramaiah) అన్నారు. బుధవారం కోదాడ పట్టణం (Kodada town)లోని స్థానిక పెన్షనర్స్ భవన్ లో అక్టోబర్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల పుట్టినరోజు వేడుక (Birthday celebration of retired employees) లను సామూహికంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనందంగా, సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలన్నారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొల్లు.రాంబాబు, అమృత రెడ్డి, రఘువర ప్రసాద్, విద్యాసాగర్, పొట్ట జగన్మోహన్ రావు, భ్రమరాంబ, శోభ, లక్ష్మీ నరసయ్య, గడ్డం. నరసయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు.