–కొలిక్కి రానున్న సొసైటీ ఇంటి స్థలాల సమస్య
–త్వరలోనే కలెక్టర్ నివేదిక సమర్పించనున్న రెవెన్యూ అధికారులు
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణ జర్నలిస్టుల హౌ సింగ్ సొసైటీ కి దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం కేటాయించిన భూములను తాజాగా సొసైటీ సభ్యులు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేం ద్రం ఎదుట గల 378,451 సర్వే నెంబర్లలోని భూమిని పరిశీలించన అనంతరం సర్వేయర్లు భూమిని సర్వే నిర్వహించడం జరిగింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాటి ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్డిఓ, నల్లగొండ తహసి ల్దార్ ఈ సర్వే పనులను తమ శాఖకు సంబంధించిన సర్వేయర్ల ద్వారా సర్వేను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేవరకొండ రోడ్ లోని నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న 699 సర్వేనెం బర్ భూమిలో సర్వే పూర్తి చేయ డం జరిగిందని, ఈ భూములకు సంబంధించిన పూర్తి నివేదిక రెండు మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి కి అందజేస్తామని రెవి న్యూ అధికారులు తెలిపారు.
శుక్ర వారం జరిగిన సర్వే పనులను జర్న లిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యు లు , నల్లగొండ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఫహీముద్దీన్, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు, హౌసింగ్ సొసైటీ సభ్యులు గుండగోని జయశంకర్, హౌసింగ్ సొసైటీ సభ్యులు, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేందర్ రెడ్డి ,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గాదె రమేష్ తదితరులు పరిశీలించారు.