పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లపై సమీక్ష
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్ల విషయమై ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తన చాంబర్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం డిప్యూటీ సిఈఓ సత్యవాణి, అదనపు కలెక్టర్లతో సమీక్షించారు
ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపుకై ఏర్పాట్ల పరిశీలన
ప్రజా దీవెన నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక(Graduate By-election ) ఏర్పాట్ల విషయమై ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తన చాంబర్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం డిప్యూటీ సిఈఓ సత్యవాణి, అదనపు కలెక్టర్లతో(Collector) సమీక్షించారు.ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన మెటీరియల్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ ముద్రణ, సెక్టోరల్ ఆఫీసర్ల నియామకం, నామినేషన్ల పరిశీలన, ఆఫీడవిట్ల అప్లోడింగ్, పోలింగ్ రోజున పంపించే నివేదికలు, కౌంటింగ్ రోజున పంపించే నివేదికలు, తదితర అంశాలపై చర్చించారు.
పోలింగ్ విధులకు నియమించే ఉద్యోగులకు సంబంధించిన డేటాను ముందే సిద్ధం చేయాలని, అలాగే అవసరమైన సామాగ్రి, బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని డిప్యూటీ సీఈఓ కోరారు.బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, ఫోటో వెరిఫికేషన్(Photo verification) ను స్థానికంగా చూడాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటుకు, అలాగే ఆయా జిల్లాల వారీగా రూట్లు,ఓట్ల లెక్కింపు కేంద్రం నిర్ధారణ, బ్యాలెట్ బాక్సుల సంసిద్ధత, వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో నోట గుర్తు ఉండదని, అలాగే అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి పరిమితి ఉండదని, పార్లమెంటు ఎన్నికలు జరిగిన 15 రోజుల్లోనే పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతున్నందున ఎన్నికలలో ఇండెలిబుల్ ఇన్క్ వాడే వేలును ఓటర్లకు తెలియజేయడం, ఇతర ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది నియామకం, జాబితాల రూపకల్పన, పోస్టల్ బ్యాలెట్ కోసం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల(Votes count) లెక్కింపుకై ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate By-election ) ఎన్నికల కౌంటింగ్ వెంటనే వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్. మహేందర్ జి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో, ఏఆర్ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, సర్వే భూమి కొలతల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్,డిఎస్పి శివరామిరెడ్డి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమయ్య తదితరులు ఉన్నారు.
Review of Graduate By-election Arrangements