RTC workers: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆర్టీసీ కార్మికులకు (RTC workers) సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court verdict) ప్రకారం హయ్యర్ పెన్షన్ చెల్లించాలని సిఐటియు (CITU) జిల్లా సహాయ కార్యదర్శి ,ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ నల్గొండ డిపో గౌరవా ధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ టీజి ఆర్టిసి స్టాఫ్ (Nalgonda TG RTC Staff)అండ్ వర్కర్స్ ఫెడరేష న్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ము ద్రించిన కరపత్రాలను నల్లగొండ డిపో ముందు ఆవిష్కరించి కార్మికు లకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడు తూ చట్టాన్ని నిర్వీర్యం చేసి పెన్షన్ కుదించే చర్యలు విడనాడాలని అన్నారు. 2014 లో హయ్యర్ పెన్ష న్ రిజెక్ట్ చేయబడ్డ 7373 మం దికి న్యాయం చేయాలని కోరారు. డి మాండ్ నోటీస్ లెక్కల షీటును కార్మికులకు ఇవ్వాలని ఆ నోటీసు తోపాటు చట్ట ప్రకారం పెన్షన్ (Pension) ఎంత వస్తుందో తెలియజేయాలని కోరా రు. సుప్రీంకోర్టు తీర్పు వెలవరించి నేటికీ 20 నెలలు గడిచిందని తీర్పు అమలు చేయడంలో ఈపీఎఫ్ ఆర్పిఎఫ్ లు అనేక సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు.
డిమాండ్ నోటీస్ (Demand Notice) జారీ చేసిన తర్వాత మూడు నెలల గడువు లోపల చెల్లించవచ్చ ని సర్కులర్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం 60 నుండి 70 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం వల్ల కార్మికులు డబ్బులు చెల్లించే అవకాశం కోల్పో తున్నారు. డిమాండ్ నోటీసులు ఏ లెక్కల ఆధారంగా లెక్కించారో ఆ లెక్కలు కార్మికులకి ఇవ్వడం లేదు తమకు వచ్చిన డిమాండ్ నోటీసు లో డబ్బులు చెల్లిస్తే తనకు పెన్షన్ ఎంత వస్తుందో తెలియడం లేదు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్య ల పరిష్కారం కోసం కేంద్ర ప్రావిడెం ట్ ఫండ్ కమిషన్ దృష్టికి సిఐటియు తీసుకువెళ్లిందని గుర్తు చేశారు. తక్ష ణమే ఆర్టీసీ కార్మికుల (RTC workers) పెన్షన్ సమ స్యలు పరిష్కరించక పోతే ఆందోళ నలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిం చారు.ఈ కార్యక్ర మంలో రీజియన్ ఉపాధ్యక్షులు ఆర్ శ్యామ్ సుందర్, లింగయ్య, రాములు , శంకర్, యా దయ్య తదితరులు పాల్గొన్నారు.