Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sabihuddin Fareed: ముగిసిన బి ఆర్ ఎస్ నేత ఫరీదోద్దీన్ అంత్యక్రియలు

Sabihuddin Fareed: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అనారోగ్యం తో మరణించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ సబిహుద్దీన్ ఫరీద్ (ఫరీ దోద్దీన్) అంత్యక్రియల ముగి శా యి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఫరీదోద్దీన్ పార్ధివ దేహానికి మునుగోడు రోడ్ ఖబరస్థాన్ లో జ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మహమ్మ ద్ అలీ, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,(Jagdish Reddy, Mohammad Ali, Nalgonda ZP former chairman Banda Narendra Reddy) నకరే కల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ముఖ్య నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఫరిదొద్దీన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో చురుకైనా పాత్ర పోషించారని, పార్టీ అభివృద్ధికి నిజాయితీ గా, నిస్వార్థంగా పనిచేసిన నాయకుడని కొని యాడారు.

ముస్లిం మైనారిటీల సంక్షేమం (Welfare of Muslim Minorities) కొరకు కృషిచేసిన వ్యక్తి అని, వారి మరణం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని తమ సంతాపాన్ని తెలియ చేసారు. ఆయన వెంట బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శులు (BRS State Secretaries) చాడా కిషన్ రెడ్డి, నిరంజన్ వలి,జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రెగట్టే మల్లికా ర్జున రెడ్డి,నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,సింగం రాంమో హన్, జమాల్ ఖాద్రి,సయ్యద్ జాఫర్ తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.