ప్రజదీవెన, నల్గొండ టౌన్ : లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణం స్థానిక గిరిజన బాలుర కాలేజీ వసతి గృహం నందు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ అధ్యక్షతన జరిగిన డ్రగ్స్ మత్తు పదార్థాలు మద్యపానంపై అవగాహన సదస్సుకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏ ఎస్ పి రాములు నాయక్ చదువుకునే విద్యార్థులు తెలిసి తెలియని వయసులో అలాగే మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు చెడువాట్లకు అలవాటై అలాగే డ్రగ్స్ మద్యపానాలకు అలవాటై వారి ఉజ్వల భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారు.
ఇటువంటి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మంచిగా చదువుకొని మనం చదువుకునే పాఠశాలలకు గురువులకు మన మీద నమ్మకం పెట్టుకుని రాత్రి బోళ్లు కాయ కష్టం చేస్తూ బ్రతికే మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వచ్చి వారిని పదిమందిలో గౌరవంగా తలెత్తుకునేటట్టు చేయగలగాలి.
తెలిసి తెలియని వయసులో లేనిపోని అపోహలకు పోయి లేనిపోని ఊహలకు పోయి ఎవరికోసమో మీరు మీ భవిష్యత్తులో అలాగే మీ తల్లిదండ్రుల కష్టాలను మీ గురువుల ఆశయాలను అమ్ము చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటు కావద్దు అన్నారు నేటి బాలలే రేపటి పౌరులుగా మీరు ముందుకు వెళ్లాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు విజయవంతంగా ఈ అవగాహన సదస్సును విద్యార్థులకు యువకులకు పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలోతెలియజేస్తున్నాము అని అన్నారు.
విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పై స్థాయి ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.పోలీసు కళా బృందం కళాకారులచేత పాటలు పాడి డ్రగ్స్ మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్, గిరిజన బాలుర వసతి గృహ అధికారులు రామకృష్ణ, మహేష్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను, ప్రభుత్వ ఉపాధ్యాయులు మధు నాయక్, యాదగిరి, రమేష్ మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.