Animal Husbandry Department: వేతనాల విడుదల పట్ల హర్షం
పశుసంవర్ధక శాఖ లో విధులు నిర్వహిస్తున్న గోపాలమిత్రుల కు మూడు నెలల వేతనాలు విడుదల చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు.
అటేండర్ పోస్ట్ లలో సీనియర్ గోపాలమిత్ర లకు అవకాశం కల్పించాలి
30 శాతం కోట కేటాయించాలి
తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రజా దీవెన నల్గొండ: పశుసంవర్ధక శాఖ లో విధులు నిర్వహిస్తున్న గోపాలమిత్రుల కు మూడు నెలల వేతనాలు విడుదల చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర(Gopalamithra) సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అయనా మీడియా తో మాట్లాడారు. మూడు నెలల వేతనాల విడుదల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
నిత్యం రైతులకు అందుబాటులో వుంటూ సేవలు చేస్తున్నామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ(Animal Husbandry Department) లో సిబ్బంది కొరత ఉన్న, రైతులకు నష్టం వాటిల్లకుండ మండల పశువైద్య అధికారి సలహా, సూచనల మేరకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు(medical service) అందిస్తున్న గోపాల మిత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి శాఖ లో ఖాళీ గా ఉన్న అటేండర్ పోస్ట్ లలో సీనియర్ గోపాలమిత్ర లకు అవకాశం కల్పించాలని కోరారు. అర్హత కలిగిన గోపాల మిత్రులకు వెటర్నరీ సహాయకులు గా 30 శాతం కోటను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రులు శంభు లింగం, యాదగిరి, రామకృష్ణ, విజయ్ సింహ పాల్గొన్నారు.
Salary released Animal Husbandry Department