Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sambasivarao: ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ లో సిపిఐ శతాబ్ది ఉత్సవం

–ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండా మాత్రమే
–హక్కుల కోసం సంఘాలను స్థాపించింది సిపిఐ పార్టీయే
–ఈనెల 30 జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
— సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు

ప్రజా దీవెన, నల్లగొండ : ఉద్యమా లకు పురుడు పోసిన నల్లగొండ గడ్డ పై ఎంతో మంది కమ్యునిస్టు నాయ కులు ప్రాతినిధ్యం వహించిన ప్రాం తం అని,ఎంతో మంది శాసన స భ్యులు, పార్లమెంట్ సభ్యులు నల్ల గొండ జిల్లా గడ్డ పై గెలిచి ప్రజా గొం తుకను అసెంబ్లీలో వినిపించారని, అంతటి మహోన్నతమైన విప్లవ పోరాటం చరిత్రలో నల్లగొండ జిల్లా కేంద్రంలో సిపిఐ శతాబ్ది ఉత్సవా బహిరంగ సభ ఈనెల 30న అత్యంత వైభవంగా జరుగుతుం దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈసభకు రాష్ట్ర నలు మూలల నుండి భారత కమ్యూ నిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు మేధా వులు పార్టీ సానుభూతిప రులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని వియవంతం చేయాలని కోరారు.

ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మగ్దుమ్ భవనoలో సిపిఐ జాతీయ సమితి సభ్యు లు,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి,జిల్లా కార్యదర్శి నెల్లికంటి స త్యం,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప ల్లా నర్సింహా రెడ్డి లతో కలసి ఏర్పా టు చేసిన విలేకరుల సమా వేశం లో సాంబాశివరావు మాట్లాడుతూ సిపిఐ శతాబ్ది ఉత్సవాలు సంవ త్సరకాలం పాటు జరుగు కార్య క్రమాలకు నాంది పలుకుతుందని తెలియజేశారు.అంతిమంగా క మ్యునిజానికి అంతం లేదని పుట్ట గొడుల్ల పుట్టుకొచ్చే పార్టీలు అధి కారం లేకపోతే కనుమరుగయ్యే పార్టీలు, రోజుకో జెండా మార్చే నాయకులు ఉన్న రోజుల్లో వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి ఒక్కరికీ ఓ దిక్సూచి అని పేర్కొన్నారు.

అధికారం ఉన్న లేకపోయినా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు ఒడిదుడుకుల ను ఎదుర్కొని కార్మికులకు ఎనిమి ది గంటల పనిదినాలు,ఉపాధి హా మీ చట్టం,దున్నే వాడిదే భూమి అంటూ ఎన్నో చట్టాల అమలులో కమ్యూనిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు కార్మిక హక్కుల సా ధనకై కార్మికుల కోసం కర్షకుల కో సం పేదవాడి ఆకలి తీర్చడానికి పోరాటాలు నిర్వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని దేశ స్వతంత్రం కోసం తెలంగాణ విము క్తి పోరాటంలో విలీన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు వారందరి ఆశయ సాధనలో భా గంగా ఈ శతాబ్ది వేడుకను అత్యం త వైభవంగా ఉత్సాహపూరితంగా జరుపుతూ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సా హాన్ని నింపుతూ కమ్యూనిస్టులకు పూర్వ వైభవంతో పాటు ఉద్యమ కార్యచరణకు ఈ వేదిక నాంది పలుకుతుందని తెలిపారు.

సిపిఐ జాతీయ సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి మాట్లా డుతూ దేశంలో జరిగే ప్రతి సిపిఐ నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. సిపిఐ ఆవిర్భావం నుంచి ఎన్నో కుట్రలు నిర్బంధాలు కేసులు ఎదురుకొని నేటికి 100 సంవత్సరా లు పూర్తి చేసుకోవడం గర్వకారణ మన్నారు.దేశంలో ఏ ఒక్క రాజకీ య పార్టీ స్వతంత్రంగా అధికారం చేసే పరిస్థితి లేదన్నారు. దేశవ్యా ప్తంగా వివిధ కారణాలతో చీలిపో యిన కమ్యూనిస్టులంతా ఏకమైతే భారతదేశానికి ప్రత్యయంగా కమ్యూనిస్టు పార్టీ నిలిచి పోతుం దని అందుకోసం అన్ని పార్టీలు ఐక్యం కావాలని సూచించారు. 30న ఎన్ జి కాలేజీ మైదానంలో జరగబోయే బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సుమారు 20 వేల మంది ఎర్ర చొక్కలు ధరించి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు,అభిమానులు తరలి వస్తున్నారని తెలిపారు. జిల్లా కార్య దర్శి నెల్లికంటి సత్యం మాట్లాడు తూ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ వి ముక్తి కోసం సాగు తాగునీరు అం దించాలని దశాబ్ద కాలంగా సిపిఐ అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు.

యురేనియం, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కు వ్యతిరేకంగా సిపిఐ చేసిన పోరాట ఫలితాన్ని నాటి ప్రభుత్వా లు వాటిని వెనుకకు తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తు కాలం లో కూడా సిపిఐ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి పు నరoకితమవుతామని పేర్కొన్నా రు. విలేకరుల సమావేశంలో సిపిఐ సినియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్ రావు, ఉజ్జిని యాదగిరి రావు,జిల్లా సహా య కార్యదర్శి లోడంగి శ్రవణ్ కు మార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, కార్యదర్శి పల్లె నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్ అంజ చారి, బంటు వెంకటేశ్వర్లు, బల్గూరి నరసింహ, గురుజా రామ చంద్రం,టి వెంకటేశ్వర్లు, నలపరా జు రామలింగం,పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్ , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజి, మురళి, తదితరులు పాల్గొన్నారు.