Sand illegal transport:ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి, ఇటుకలపాడు, జాజిరెడ్డి గూడెం పరిధిలోని మూసి వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఆపాలని,లేని పక్షంలో ఆందోళన చేపడుతామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ తెలిపారు.
సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, డిమాండ్
ప్రజా దీవెన, శాలిగౌరారం : నల్లగొం డ జిల్లా శాలిగౌరారం(Shaligouraram)మండలం వంగమర్తి, ఇటుకలపాడు, జాజిరెడ్డి గూడెం పరిధిలోని మూసి వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఆపాలని,లేని పక్షంలో ఆందోళన చేపడుతామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్(Mandari David Kumar)తెలిపారు. శాలిగౌరారం మండలం మాదారం గ్రామంలో సీపీఐ ఎం-ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్(BRS) పాలనలో ఇసుక అక్రమ రవాణా కోట్లల్లో జరిగిందని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల(Elections) ప్రచారంలో టెంక ఇసుక కూడా తీయమని నీతివాక్యాలు పలికి గెలిచినంక ప్లేట్ పిరాయించాడని అన్నారు. ప్రభుత్వ పనుల పేరుతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి రైతు పంట పొలాలు దెబ్బతిన్నాయని అన్నారు. బావులు, బోర్లు అడుగంటి పొయాయని అన్నారు. రోజుకు వందల సంఖ్యలో లారీలల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోన్నారని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఇసుక తరలింపును ఆపాలని, లేకుంటే మండల వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఇసుక క్వారీల్లో వాటర్ ట్రయాంకర్లు, జేసీబీ డోజర్లు, ఇటాచ్చిలతో ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. మూసీ నదిని లూటీ చేస్తున్నారని, క్వారీల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీ జరుగుతున్న ప్రభుత్వ అధికారుల నిఘా లేదని అన్నారు. స్టాక్ యార్డ్, చెక్ పాయింట్లు, వేబ్రిడ్జిల ఊసే లేదని మండిపడ్డారు. లెక్కకు మించి లారీలతో జియో ట్యాగ్(Geo tag)లేకుండా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఇలా కొనసాగితే మూసినది మట్టిదిబ్బగా మారుతోందని అన్నారు. టీఎస్ ఎం డి సి తెలంగాణ రాష్ట్ర ఖనిజాబివృద్ధి సంస్థ(Telangana State Mineral Development Corporation)నిబంధనలు తుంగలో తొక్కరని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, ఇఫ్టూ రాష్ట్ర కోశాధికారి గంట నాగయ్య, అఖిల భారత రైతు- కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బొడ్డు శంకర్, కునుకుంట్ల సైదులు, పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు వెంకటేశ్వర్లు, బి.వి చారి, ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బీరెడ్డి సత్తిరెడ్డి(Beereddy Sattireddy), పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు పుల్లూరి సింహాద్రి, బండారు వెంకన్న, వీరంజనేయులు, సైదులు, వీరబోయిన రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Sand illegal transport in shaligowraram