Sankranti festival : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహిళలు అన్ని రంగాలలో ముందుకొస్తున్న తరుణంలో వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడం కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు హాశం అన్నారు. ఆది వారం పద్మా నగర్ సిపిఎం శాఖ ఆధ్వర్యం లో ముగ్గుల పోటీలు నిర్వహించ డం జరిగింది. ఈ సందర్భంగా హాశం మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుండాలని అన్నా రు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిం చారు. మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకోవడం మినహా వారికోసం చేసింది ఏమి లేదని అన్నారు. ప్రభుత్వాలు మహిళల హక్కులు హరిస్తున్నారని రోజురోజుకు హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు. పద్మానగర్లో జీవనోపాధి కోసం వలస వచ్చి అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, బహుమతి దాత పొట్ట బత్తుల సత్యనారాయ ణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఐక్యత భావంతో ముం దుకు వెళ్లడంసంతోషకరమని అన్నారు.
పద్మా నగర్ మహిళలు కోలాటాలు నేర్చు కున్నారని అదేవిధంగా బాలికలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ముగ్గు లు వేసిన మహిళలకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు చీరలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమ తులు అందరికీ అందజేయడం జరిగింది. పద్మ నగర్ సిపిఎం శాఖ కార్యదర్శి గంజి నాగరాజు అధ్యక్ష తన జరిగిన కార్యక్రమంలో పుట్ట బత్తుల అండాలు,ఉదయ్ కిరణ్ , సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పెండెం రాములు, జిల్లా ప్రచార కార్యదర్శి పసునూరి యోగానందం, కార్యదర్శి సూరపల్లి భద్రయ్య, మహిళా అధ్యక్షురాలు మూడ చంద్రకళ, కార్యదర్శి మిర్యాల శ్రీవాణి సభ్యులు పాల్గొన్నారు