Sankranti Festival : ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ లోని జెఎంజె ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు సంక్రాంతి పండుగ సందర్బంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థులు అన్ని రంగుల తో అందంగా ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల ఇంచార్జ్ పంతంగి జానయ్య ప్రిన్సిపాల్ వెంగళి జానయ్య లు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గాజుల రమేష్, కొయ్యడ శివశంకర్,యాదయ్య, ఖాజా మోహినూద్దీన్,సువర్ణ డెంకల వెంకటమ్మ,సత్యవతి, నాగలక్ష్మి,ఉమారాణి, మౌనిక పావని, మమత లు పాల్గొన్నారు.