SANKRANTI FESTIVAL : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: యువత సాంస్కృతి సంప్రదా యాలను అలవర్చు కోవాలని వికాస తరంగిణి అధ్యక్షురాలు చొక్కారపు మాధవి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలో ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ యువత పండుగ గొప్పతనాన్ని తెలుసుకుని వాటి విశిష్టతను అలవర్చుకోవాలని అన్నారు.
ఇంటి ముందు వేసిన ముగ్గుల్లో పాతబస్తీకి చెందిన ఐశ్వర్య గోదా దేవి ముగ్గు వేసి తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతలకు వెన్నెల సారీస్ ఆధ్వర్యంలో చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రీతి నాగలక్ష్మి ముత్తమ్మ నరహరి శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు