–యువజన సర్వీసుల యూత్ ఆఫీసర్ రమావత్ సైదానాయక్
Sant Sewalal Birth Anniversary: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ 284వ జయంతి ఉత్స వాలను ఘనంగా నిర్వహిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన సర్వీసుల శాఖ యూత్ ఆఫీసర్ రామావత్ సైదా నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యా ర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సంత్ సేవాలాల్ సామాజిక పరివర్తన ఉద్యమకారుల పరంప రలో ఒకరిగా అభివర్ణించారు. సా మాజిక పరివర్తన సమ్మిళిత సమా జం కొరకు 22 సూత్రాలను అందిం చి మొత్తం సమాజం కొరకు శక్తివం చన లేని స్ఫూర్తి దాతలుగా నిలిచే మార్గాన్ని అందించారన్నారు.
ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా జ్ఞానవంతులై మానవీయ సమాజం కొరకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ముద్దులు సాంప్రదాయ పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ ఆచార్య అల్వా ల రవి, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డా మద్దిలేటి, డా మారం వెంకటరమ ణారెడ్డి, డా మిర్యాల రమేష్, డా సురేష్ రెడ్డి,రమేష్ నాయక్, నరసిం హ, అనిత, షరీఫ్ పండరయ్య తది తర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.