–సైలెన్సర్లు మార్పిడి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు
–జిల్లా ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Sarat Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar) ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ద్విచక వాహనదా రులు అధిక శబ్దం కలిగించే సైలెన్స ర్ మాడిఫై (Modify the silencer) చేసి అధిక శబ్దాలతో సౌండ్-పొల్యూషన్ చేస్తూ, సామా న్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు 80 వాహనాల సైలెన్సెర్స్ లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ కూడలి నందు రోడ్డు రోలర్ తో ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడి షనల్ ఎస్పి మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మాడిఫైడ్ సైలెన్సర్లు గల 80 ద్విచక్ర వాహ నాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్స్ తీసివేయించి క్లాక్ టవర్ కూడలి నందు రోడ్డు రోలర్ తో తొక్కిస్తు ద్వంసం చేయడం జరిగిం దని అన్నారు. ద్విచక్ర వాహనదా రులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని, సైలె న్సర్లను ఎలాంటి మార్పుడి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు (Modified silencers) వినియోగించినట్లైతే అట్టి వాహనదారుల లైసెన్సు రద్దు చేసి, అట్టి వాహనాన్ని సీజ్ చేయించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనదారులు కంపెనీ.సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ డ్రైవ్స్ (Special drives)నిర్వహించడం జరుగుతుంది అన్నారు. జిల్లా ప్రజల సురక్షిత ప్రాయాణానికి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించగలరని అన్నారు. ఎవరైనా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్స్ లు మార్పిడి చేస్తే సంబంధిత పోలీసు అధికారులకు తెలపగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ క్రాంతి, 2 టౌన్ సిఐ డానియల్,1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ యస్.ఐ నాగరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.