Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarat Chandra Pawar: గంజాయి ముఠా అరెస్టు

— నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

Sarat Chandra Pawar:ప్రజా దీవెన, క్రైమ్: అక్రమ గంజాయిని విక్రయిస్తున్న అయిదుగురు నిందితులని అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు: జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (Sarat Chandra Pawar)మునుగోడు పోలీసు స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో వివరాలను వెల్లడించారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన నిమి త్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు తెలంగా ణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో బాగంగా నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ జిల్లా ను డ్రగ్స్ రహిత (Drug free)జిల్లాగా మార్చడంలో బాగంగా వారి ఆదేశాల ప్రకారం నల్లగొండ డిఎస్పి (Nalgonda DSP) పర్యవేక్షణలో లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంతలోని షె డ్ వద్ద ఐదుగురు వ్యక్తులు గంజా యి అమ్ముచున్నారన్న అని నమ్మ దగిన సమాచారం మేరకు, మును గోడు యస్.ఐ సిహెచ్.

వెంకటేశ్వర్లు మరియు వారి సిబ్బంది తో యు క్తముగా ఉదయం దాదాపు 8.30 గంటల లక్ష్మీదేవి గూడెం (Goddess Lakshmi’s house) వద్ద ఐదు గురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ (Motorcycle)లతో పశువుల సంత లోని షెడ్ అనుమానాస్పద స్థితిలో ఉండ గా యస్.ఐ తన సిబ్బందితో యు క్తంగా పట్టుబడి చేసి, విచారణ చేయగా హైదరాబాద్ లోని ధూల్ పేట్ చెందిన గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఐదు ప్యాకెట్లు లలో 200 గ్రాములు రూ.2 వేల చొపున మొత్తం రూ.10 వేల విలువ గల గంజాయిని కొనుగోలు చేసి, మో టార్ సైకిల్ పై లక్ష్మి దేవిగూడెం రోడ్ ప్రక్కన గల పశువుల సంత లోని షెడ్ వద్దకు తీసుకవచ్చి వారి స్నేహి తులకు తెలియపరచగా అక్కడికి వచ్చిన వారు అట్టి గంజాయిని 20 0 గ్రాములు చొప్పున తీసుకొని, గంజాయి త్రాగే వ్యక్తులకు అమ్ము దామనితీసుకపోవడానికి సిద్ధంగా ఉండగా, పోలీస్ వారు. పట్టు బడి చేసి, వారి వద్ద నుండి అందాజ 1000 గ్రాములు గంజాయిని, గంజాయి రవాణా చేయుటకు ఉపయోగించిన 4 సెల్ ఫోన్ లను స్వాదిన పరుచుకున్నారు.

ఇట్టి వ్యక్తులు తక్కువ ధరకు గంజాయిని దూల్పెట్, హైదరాబాద్ (Ganjaini Dulpet, Hyderabad) నందు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి, మునుగోడు చుట్టు ప్రక్కల వారకి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇందులో బాగముగా 35 మంది భాదితులను గుర్తించి, వారిలో కొంత మందికి పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లుగా వచ్చినది మరియు అందరికి కౌన్సిలింగ్ చేయనయినది.ఇట్టి గంజాయిని కేసును ఛేదించిన నల్లగొండ డియస్పి కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూర్ సి.ఐ వెంకటయ్య ఆధ్వర్యంలో, మునుగోడు యస్.ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది రమేశ్, నర్సింహా, వెంకన్న, నాగేశ్వర రావు, ఆంజనేయులు, జానీ, మోహన్ లను అభినందించారు.