–నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్ లో అందుబాటులో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్.
Sarat Chandra Pawar IPS:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ :ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా రేపు నాగార్జున సాగర్ పోలీసు స్టేషన్లో (police station) ఉదయం 10.00 గంటలకు మీట్ (meet) యువర్ యస్పి (Sarat Chandra Pawar IPS) కార్యక్రమాన్ని నిర్వహించానున్నారని జిల్లా ఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు. బాధితుల యొక్క ఫిర్యాదులను పోలీసు స్టేషన్లలోనే పరిశీలించి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున ఆ మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యల గురించి ఎస్పిని స్వయంగా కలిసి దరఖాస్తులు సమర్పించేందుకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.