Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sarat Chandra Pawar: రు. కోటి41 లక్షల విలువైన గంజాయి దగ్ధం

–డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రకారం సీజ్
–మాధక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటయే లక్ష్యంగా జిల్లా పోలీ సుల కృషి
–గంజాయి అక్రమ రవాణ, విక్రయిం చిన కఠిన చర్యలు
— నల్లగొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్

Sarat Chandra Pawar:ప్రజా దీవెన, నల్లగొండ: మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 43 కేసులలో 565 కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుషంగా జనావసానికి దూరంగా ఉన్న టువంటి నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా యస్.పి, డ్రగ్ డిస్పోజల్ కమిటీ (YSP, Drug Disposal Committee) అధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ (sp) మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం గా జిల్లా పోలీసులు అక్రమ గంజా యి సరఫరా చేయు వారి పైన ప్రత్యేక నిఘా పెడుతూ అత్యధి కంగా విజయపురి పోలీసు స్టేషన్ పరిదిలో 2 కేసులలో 323 కేజీలు, కేతపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో 98 కేజీలు సీజ్ చేయగా మొత్తం 43 కేసులలో 565 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో అక్రమ గంజాయి, డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నమని మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు నిర్వహిస్తూ, ఎంతో మందిని అరెస్టు చేసి జైలు (jail)పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుం టున్నామని పేర్కొన్నారు.

యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి
యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల (Narcotics)బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు,ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు.జిల్లాలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని,జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ (Toll free)నంబర్ 8712670266 కి సమాచారం తెలపాలని కోరారు.