–బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలి
–నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
Sarat Chandra Power: ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ (Nalgonda) జిల్లా పరిధిలో ప్రతి సోమ వారం ప్రజల సౌకర్యార్థం నిర్వహిం చే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో (police office) గ్రీవెన్స్ డే (Grievance Day)నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 40 మంది అర్జీదా రులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను (problems) తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రోజు వచ్చిన పిర్యాదులు భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్ సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను (polcie department)మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అ న్నారు. పోలీస్ స్టేషన్ కి (polcie station)వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించా లని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ (monitoring)చేస్తున్నట్లు తెలిపారు.