Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SC classification: ఎస్సీ వర్గకరణపై సంబరాలు

SC classification: ప్రజా దీవెన, నల్లగొండ: మూడు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ (SC classification) అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్య క్షుడు బోడ సునీల్ మాదిగ (Sunil Madiga), అంబే డ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తుల జగన్ కుమా ర్, దళిత సంఘాల ఐక్యకార్యాచ రణ సమితి చై ర్మన్ పెరిక కరణ్ జయరాజ్ లు పేర్కొన్నారు. శుక్ర వారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపు కున్నారు. బాణసంచా కాల్చి మిఠా యిలు పంచుకొని హర్షా తిరేకాలు వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లా కేంద్రం లో ఎస్సీల ఏబీసీడీ వర్గీక రణకు (ABCD of the SCs) అను కూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా మని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కత్తుల జగన్ , మార్, దళిత సంఘాల ఐక్యకార్యా చరణ సమితి చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ అన్నారు. కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డీఈవో కార్యాలయం ఎదుట గల అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. అనంత రం మాట్లాడుతూ 30 సంవత్సరా లుగా చేస్తున్న పోరాటానికి నిజమై న సార్ధకత లభించిందన్నారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పిం చాలన్నారు. కార్యక్ర మంలో బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాద వ్, వివిధ కులసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శాలిగౌరా రంలో మంద కృష్ణ ఫ్లెక్సీకి నాయకు లు క్షీరాభిషేకం చేశారు. పాక యాదగిరి, వడ్డెబోయిన సైదులు, శ్రీకాంత్, ప్రసాద్, నర్సింహ, ఏడు కొండలు, వినోద్ కుమార్ పాల్గొ న్నారు.మంత్రి క్యాంపు కార్యాల యంలో మిఠాయిలు పంపిణీ చే శారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వై స్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వూరె లక్ష్మ ణ్ పేర్కొన్నారు. ఆయన వెంట కొండూరి పవనకుమార్, మద్దెల కృష్ణగౌడ్, పడకంటి శివ పాల్గొన్నారు. అదే విధంగా దేవరకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (Press conference) ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మక ఘట్టమని, 30 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమన్నా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వస్కుల సుధాకర్, ప ట్టణ అధ్యక్షుడు ఆంజయ్యయాదవ్ తెలిపారు.