Bandi Sanjay: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం
తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతి పెద్ద కుంభకోణం పౌరసరఫరాల శాఖలోనే జరిగింద ని బీజేపీ. జాతీయ ప్రధాన కార్యద ర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపిం చారు.
ప్రతిష్టాత్మక కాళేశ్వరం తరహాలో సివిల్ సప్లయి శాఖ లోనే అతిపెద్ద స్కాం
అంచనాలకు అందని అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిం చాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ లకు గుణపాఠం చెప్పాలి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: తెలంగాణలో(Telangana) కాళేశ్వరం స్కామ్ తర్వాత అతి పెద్ద కుంభకోణం పౌరసరఫరాల శాఖలోనే జరిగింద ని బీజేపీ. జాతీయ ప్రధాన కార్యద ర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపిం చారు. ఈ శాఖలో జరిగిన అవినీ తిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ హయాం నుంచే సివిల్ సప్లయ్ శాఖ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వచ్చాక కూడా అదే పరిస్థితి కొన సాగుతోందని ధ్వజమెత్తారు. వరంగల్-నల్లగొండ – ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం బండి సంజయ్(Bandi Sanjay) నల్లగొండలో మీడి యాతో మాట్లాడారు.
రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి అప్ప గించేందుకు మధ్యవర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్ప టికీ అర్థం కావడం లేదన్నారు. రైస్ మిల్లర్ల అసోసియే షన్ లోని కొంతమంది నాయకుల్లో అక్రమా ర్కులు ఉన్నారని, వీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయ కులకు లంచాలు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారని కీలక వ్యాఖ్య లు చేశారు. రైస్ మిల్లర్ల(Rice millers)నుంచి గతంలో పలువురు నాయ కులకు ముడుపులు ముట్టాయని, దీనిపై విచారణ జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) నాయకులకు కండ కావరం తలకెక్కిందని, అందు కే హిందూ దేవుళ్లు, అక్షింతలు, ప్రసాదాలను అవమానిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
ఆ పార్టీలకు ఎమ్మెల్సీ(MLC) బైపోల్లో గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మతప రమైన రిజర్వేష న్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన మాకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం కాంగ్రెస్ వారు ఎవరికీ ఇవ్వరని, వారిలో వారే ప్రభుత్వాన్ని కూలదోసుకుంటారని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయ కుడినీ ప్రజలు రోడ్లపై తిగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. ఆరు గ్యారెంటీల సంగతి ఏంటని ప్రజలు నిలదీస్తారని తెలిపారు.
scam in civil supplies department