Volleyball Competitions: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల గారి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి SGF అండర్ 14, 17 బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Competitions), సెలక్షన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులందరూ (PET Teachers) ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ వంతం చేయడానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి దగ్గుపాటి విమల (Daggupati Vimala) మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లా నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, క్రీడాకారులందరికి భోజన, మంచినీటి సదుపాయాలు కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి (bikshapathi) ఎస్జిఎఫ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగరాజు, కవిత, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీదేవి, చంద్రయ్య, సురేందర్, కర్ణాకర్ రెడ్డి, నుష్రత్, బ్రహ్మయ్య, మురళి, లెనిన్, సావిత్రి, రంగా, బొమ్మపాల గిరిబాబు, తస్లీమ్, రెహనా, శ్రీను, అజయ్ మరియు సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల స్కూల్ గేమ్స్ సెక్రటరీలు వివిధ మండలాల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.