ఎన్నికలలో సూక్ష్మ పరిశీలనది కీలక బాధ్యత
ఎన్నికలలో సూక్ష్మ పరిశీలనది కీలక బాధ్యత అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ అన్నారు.
రహస్య ఓటింగ్ విధానంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నది లేనిది పరిశీలించాలి
పోలింగ్ రోజున ఎన్నికల పరిశీలకులకు చెక్ లిస్ట్ లో అన్ని వివరాలు రిపోర్ట్ చేయాలి
జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్
ప్రజా దీవెన నల్లగొండ: ఎన్నికలలో సూక్ష్మ పరిశీలనది కీలక బాధ్యత అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ (Shravan) అన్నారు.సోమవారం జిల్లా పరిషత్ ఆడిటోరియం హాలులో సూక్ష్మ పరిశీలకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా 374 మంది సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన పర్యవేక్షణలో కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం సూక్ష్మ పరిశీలకులు ఎన్నికలలో పాటించవలసిన నియమ నిబంధనలను ఆయన తెలిపారు. ముఖ్యంగా సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల పరిశీలకుల స్థానంలో పనిచేయవలసి ఉంటుందని, ఎన్నికల పోలింగ్ (Polling) పూర్తి అయ్యేవరకు పరిశీలకులు పూర్తి అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించింది లేనిది పరిశీలించాలని, మాక్ పోలింగ్, రహస్య ఓటింగ్ (Secret ballet) విధానంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతున్నది లేనిది పరిశీలించాలని తెలిపారు.
అంతేకాక కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ పార్టీ పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నది లేనిది గమనించాలని, పోలింగ్ రోజున ఎన్నికల పరిశీలకులకు చెక్ లిస్ట్ లో అన్ని వివరాలు రిపోర్ట్ చేయాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ జెడి (JD) తో పాటు, ఎల్డీఎం శ్రామిక్ హాజరుకాగా, మాస్టర్ ట్రైనర్ బాలు సూక్ష్మ పరిశీలకు శిక్షణను ఇచ్చారు. తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
Scrutiny is a key responsibility elections