Grains: విత్తనాలు అందుబాటులో ఉంచుతాం
నల్లగొండ జిల్లాలో వానాకాలం-2024 సీజన్ కు సంబందించి 5,68,735 ఎకరాలలో ప్రత్తి పంట సాగుచేయడానికై ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి పి.శ్రవణ్ కుమార్ తెలిపారు.
5,68,735 ఎకరాలలో పత్తి పంట సాగుకు ప్రణాలిక సిద్ధం
డీఏఓ శ్రవణ్ కుమార్
ప్రజా దీవెన నల్గొండ: నల్లగొండ జిల్లాలో(Nalgodna district ) వానాకాలం-2024 సీజన్ కు సంబందించి 5,68,735 ఎకరాలలో ప్రత్తి పంట సాగుచేయడానికై ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి పి.శ్రవణ్ కుమార్ తెలిపారు. బుధ వారం నల్లగొండలోని వ్యవసాయ శాఖ(Department of Agriculture) కార్యా లయంలో పత్తి విత్తనాల కంపెనీల ప్రతినిధులు, పంపిణీ దారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా అయనా మాట్లాడుతూ వానాకాలంలో సాగు కోసం రైతులకు(farmers) అవసరమైన 9 లక్షల 80 వేల పత్తి విత్తన ప్యాకెట్లను డీలర్ల వద్ద అందుబాటు ఉంచుతామని తెలిపారు. పత్తి విత్తే సమ యానికి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంటాయ న్నారు. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసి నప్పుడు సంబంధిత డీలర్ వద్ద తప్పనిసరిగా రశీదు పొందాలన్నారు. విత్తన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలిగించినా సంబం ధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Seeds available for farmers