Election Rules :ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంగిస్తే తగిన చర్యలు
పార్లమెంట్ ఎన్నికలు నామినేషన్ సమయంలో అభ్యర్థుల, వారి స్టార్ కంపైనర్, ఎవరైనా నామినేషన్ల సమయంలో సభలు, ర్యాలీలు నిర్వహించెటప్పుడు పోలీసు వారి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన నల్గొండ క్రైమ్: పార్లమెంట్ ఎన్నికలు(Parliament elections) నామినేషన్ సమయంలో అభ్యర్థుల, వారి స్టార్ కంపైనర్, ఎవరైనా నామినేషన్ల సమయంలో సభలు, ర్యాలీలు నిర్వహించెటప్పుడు పోలీసు వారి ముందస్తు అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజకీయ పార్టీ నేతల బహిరంగ సభలు,(Public meeting) సమావేశాలు నిర్వహించే సమయంలో ఇతర పార్టీ నేతలు చెడగొట్టే ఉద్దేశ్యం తో అక్కడ తమ అనుచరులతో అల్లరి చేయటం, గొడవలు సృష్టించటం, అభ్యంతరకరంగా ప్రవర్తించటం చేయరాదు.
నామినేషన్(Nomination) సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు ఎవరైనా ప్రజలను ఆకర్షించడానికి కార్యక్రమాలు చేపట్టడం లేదా ప్రజలను ప్రేరేపించడం చేయరాదు.
పోటీలో ఉన్న అభ్యర్థి వ్యక్తి గత ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో లేదా ఎవరైన అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకునె విధంగా అపవాదులు వేయడం,ప్రకటనలు ఇవ్వడం లాంటివి చేయకూడదు.
నీయమలు అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్స్ 188,505(2),171G, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్స్ 123,127 ఇతర చట్టాల ఉల్లంఘన క్రింద కేసులు నమోదు చేయబడతాయి అని ఆమె హెచ్చరించారు.
Serious action on election rules neglect