Nomination: మూడవరోజు ఏడుగురి నామినేషన్
లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా మూడవ రోజైన శనివారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 7 గురు స్వతంత్ర అభ్యర్థులు 10 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ప్రజా దీవెన నల్గొండ: లోకసభ ఎన్నికల నామినేషన్లలో(Lok Sabha Election nominations) భాగంగా మూడవ రోజైన శనివారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి 7 గురు స్వతంత్ర అభ్యర్థులు 10 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా వరుసగా కుక్కల వెంకన్న ఒక సెట్ నామినేషన్, పాలకూరి రవి ఒక సెట్ నామినేషన్,పాలకూరి రమాదేవి ఒక సెట్ నామినేషన్, పనస వెంకటేశ్వర్లు రెండు సెట్లు నామినేషన్, గంగిరెడ్డి కోటిరెడ్డి రెండు సెట్లు నామినేషన్, తండు ఉపేందర్ గౌడ్ రెండు సెట్లు నామినేషన్,మారం వెంకట్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనకు వీరు నామినేషన్ పత్రాలను అందించారు.
Seven people nomination third day