— రాష్ట్ర ఎస్ సి ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్
ప్రజా దీవెన, నల్లగొండ: షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని క్రోడీకరించి దానిపై నివేదికను రూ పొందించి ప్రభుత్వానికి సమర్పి స్తామని రాష్ట్ర ఎస్ సి ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ తెలిపారు. బుధవారం అయ న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశం మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ సి కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహి రంగ విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు షెడ్యూల్ కులాల సంఘాలు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ పై దరఖాస్తులను సమర్పించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు అన్నింటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. దరఖాస్తు సమర్పించే వారందరూ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సమర్పించాలని కోరారు. వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని అన్నారు. ఇదివరకు రంగారెడ్డి, తదితర జిల్లాలలో బహిరంగ విచారణ నిర్వహించడం జరిగిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్ లో నేరుగా కమిషన్ కు వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చని అన్నారు.
కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై నిర్వహించిన బహిరంగ విచారణలో 245 మంది వ్యక్తిగతంగా,కుల సంఘాల పరంగా దరఖాస్తులు సమర్పించారు. అనంతరం చైర్మన్ నల్గొండ మండలం చర్లపల్లి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను సందర్శించి అక్కడ విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. చదువే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని, ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ సంస్థలు, అన్ని విద్యా సంస్థల్లో ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నదని, తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి వసతులు లేవని, అందువల్ల బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి రావాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్తినిల చదువు, సౌకర్యాలు, భోజనం, తదితరు అంశాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. చర్లపల్లి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు బాగున్నాయని, విద్యార్థినిలు సైతం బాగా చురుకుగా ఉన్నారని అన్నారు. కాగా ఎస్ సి వర్గీకరణ పై బహిరంగ విచారణ నిమిత్తం జిల్లాకు వచ్చిన ఎస్ సి ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ సి కార్పొరేషన్ ఈడీ, జిఎం కోటేశ్వరరావు, డిఆర్ఓ అమరెం దర్, ఆర్డీవో అశోక్ రెడ్డి లు స్వాగ తం పలికారు. వీరి వెంట రాష్ట్ర ఎస్ సి కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, డిఎస్పి శివరాం రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యాలయం సుపరింటిండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు ఉన్నారు.