Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Shankar Naik: సాంకేతిక విప్లవo ఘనత రాజీవ్ గాంధీదే

–డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్

Shankar Naik: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పారి శ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి దేశా నికి కంప్యూటర్ ను పరిచయం చేసి న ఘనత రాజీవ్ గాంధీకే దక్కు తుందని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ (Ketawat Shankar Naik)అన్నారు.మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా మంగళవారం నల్గొండలోని హైద రాబాద్ రోడ్డులో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ (Burri Srini Vas Reddy, Vice Chairman Abbagoni Ramesh Goud) తో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సద్భావన యాత్ర మొదలు పెట్టడంతో పాటు పేద ప్రజల సంక్షే మం కోసం రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలను (Many welfare schemes) అమలు చేశాడని అన్నారు. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని, ఆయన ఆశయ సాధనతో ముందుకు పోతు న్నామని అన్నారు.ఆనాడు రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దేశానికి సాంకేతిక విప్లవాన్ని పరిచయం చేయడంతో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కూరి రమేష్, జూలకంటి శ్రీనివాస్, కత్తుల కోటి, జూలకంటి సైదిరెడ్డి, పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురా లు నాంపల్లి భాగ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి రెడ్డి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు బీసం కరుణాకర్ రెడ్డి, ఇంతియాజ్, గురిజ వెంకన్న, దుబ్బ అశోక్ సుందర్, మామిడి కార్తీక్ ,పాదం అనిల్ , దాసరి విజయ్, వడ్డేపల్లి కాశీరాం, పిల్లి గిరి, అంజయ్య, సదాలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.