SI Balaraju: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండ లంలోని జమ్మన కొండ తండాలో అక్రమంగా ఒకచోట నల్ల బెల్లం దాసి ఉంచారనే సమాచారం మేర కు గురువారం హైదరాబాద్ కు చెందిన ఎస్టిఎఫ్ టీం లీడర్ ఎస్ఐ బాలరాజు (SI Balaraju) సిబ్బందితో కలిసి బెల్లం (jaggery) దాసి ఉంచినటువంటి గోదాము పై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 300 కేజీల బెల్లం 50 కేజీల ఆలం,10 లీటర్ల నాటు సారా (natu sarah)పట్టుబడింది. ఆంధ్రకు చెందిన గుంటూరు మాచ ర్ల కు చెందినటువంటి కృష్ణా నాయ క్ అనే ఒక వ్యక్తి నాటు సారా త యారీ కోసం వినియోగించే నల్ల బెల్లాన్ని అమ్మకాల కోసం ఈ గోదాంలో దాచిపెట్టి ఉంచాడు.
పట్టుబడినటువంటి నల్ల బెల్లం (Jaggery )ఆలం విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ ఎస్టిఎఫ్ బాలరాజు సిబ్బంది, అలియా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ కల్పన ఎస్సై సంపత్ పాల్గొన్నారు.బెల్లం పట్టుకున్నటు వంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫో ర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావులు (Pradeep Rao) అభినందించారు.