–టాస్క్ ఫోర్స్ ఎస్సై రెండవ భార్య జాల వసంత
SIMahender ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ టాస్క్ఫోర్స్ లో ఎస్సైగా పనిచేస్తున్న జల మహేందర్ ను నేను రెండవ వివాహం చేసుకున్న విషయం ఆయన మొదటి భార్య జ్యోతి తో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం తెలుసని ఎస్ఐ మహేందర్ రెండవ భార్య జాల వసంత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తన పిల్లలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నేను మొదటగా వివాహం చేసుకున్నానని, వివాహమైన ఏడేళ్ల తర్వాత నా భర్తతో కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నానని తెలిపారు. అనంతరం పరిచయమైన ఎస్సై మహేందర్ ను ఇష్టపడి 2014 ఏప్రిల్ 12వ తేదీన శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నానన్నారు.
వివాహం చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఈ విషయం ఆయన మొదటి భార్య జ్యోతితో పాటు వారి కుటుంబ సభ్యులకు సైతం తెలుసన్నారు. ఈ విషయంలో మొదట గొడవ జరిగిన ఆ తర్వాత ఆమెకు పిల్లలు లేకపోవడంతో నా వివాహాన్ని అంగీకరించి వేరువేరుగా ఉండేందుకు ఒప్పుకున్నారన్నారు. నాకు పెద్ద పాప పుట్టిన ఆరేళ్ల తర్వాత జ్యోతికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టారన్నారు. ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత నన్ను దూరంగా పెట్టాలని పలుమార్లు ఇబ్బందులకు గురి చేసిందని జ్యోతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. 2016 లోనే ఎస్సైగా మహేందర్ సైబరాబాద్ కమిషనరేట్ లో పనిచేస్తున్న సమయంలో జ్యోతి అప్పుడు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేయగా ఆరు నెలలు విధులకు దూరంగా ఉన్నారన్నారు.
అనంతరం పోలీసు అధికారులతో పాటు పెద్ద మనుషుల సమక్షంలో కూడా పలుమార్లు మాట్లాడుకుందామని ప్రస్తుతం నా కూతురు కు 12 ఏళ్లు, బాబుకు ఏడేళ్లు ఉన్నాయన్నారు. కావాలనే నన్ను నా పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఈ వేధింపులు భరించడం తమ వల్ల కావడంలేదని నన్ను నా పిల్లలను చావనివ్వండని ఆవేదన వ్యక్తం చేశారు. నా పిల్లలకు అవసరమైతే డిఎన్ఏ టెస్ట్ చేయించండి.. పిల్లలు మహేందర్ కు పుట్ట లేదంటే వెంటనే వెళ్ళిపోతానని స్పష్టం చేశారు.