ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జాతీయ మెగా లోక్ అదాలత్ 14 వ తారీఖున ఉన్నందున కక్షి దారులతో, వార్డ్ కౌన్సిలర్స్ మరియు వాలంటీర్ల తో సమావేశం నిర్వహించడం జరిగింది.ఇందులో నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులు, డ్రంకన్ డ్రైవ్ మరియు పెట్టీ కేస్, రాజీ చేసుకోవచ్చని కొన్ని కేసుల్లో ఫైన్ కట్టుకుంటే పూర్తి అవుతాయని చెప్పడం జరిగింది.
రాజీమార్గమే రాజ మార్గం సంవత్సరాల కొద్ది కోర్టు చుట్టూ తిరిగిన కేసులో ఒక్కరే గెలుస్తారు, కానీ రాజి పడితే ఇద్దరు గెలుస్తారని చెప్పడం జరిగింది.