Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sitaram Yechury: సీతారాం ఏచూరి మరణం తీరని లోటు

Sitaram Yechury: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) CPI (M) అఖిలభారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి (Sitaram Yechury) మరణం భారత ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని 20వ వార్డు పెద్ద బండ సెంటర్ జక్కల పుష్ప భవన్ (Jakkala Pushpa Bhavan) దగ్గర కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా హశం మాట్లాడుతూ.. కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆకస్మిక మరణం సిపిఎం (CPM) పార్టీ ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు అని భారత ప్రజానీకానికి శ్రామిక వర్గానికి కామ్రేడ్ సీతారాం ఏచూరి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థి దశ నుండి ఈరోజు వరకు విరామం ఎరగక విప్లవ సాధన (democratic movement) కోసం అనేక ఉద్యమాల రూపకల్పన చేస్తూ ప్రత్యక్ష పోరాటాల్లో భాగస్వాములై సమ సమాజ స్థాపన కోసం సాగిన ఏచూరి ప్రస్థానం చిరస్మరణీయమని అన్నారు.

ఇతని ఆశయ సాధన కోసం సిపిఎం కార్యకర్తలు అందరూ అలుపెరుగని పోరాటాలు ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు గాదే నరసింహ, శాఖ కార్యదర్శి పాక లింగయ్య నోముల యాదయ్య పాక మల్లయ్య లింగయ్య మేడిశెట్టి నరేష్, సల్వోదు సైదాచారి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు.