Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sivaram Reddy: విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి

— నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి

Sivaram Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: విద్యార్థు లు సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యా లను చేరుకోవాలని నల్ల గొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి (Sivaram Reddy)పిలు పునిచ్చారు.సామాజిక స్పృహ, అవగాహన కార్యాచరణ (Social consciousness, awareness activity) లే మిషన్ పరివర్తన లక్ష్యాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మత్తు వ్యతిరేక ఉద్యమం మిషన్ పరివర్తన లో భాగంగా నల్లగొండ రూరల్ అన్నారెడ్డి గూడెం గ్రామంలో సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో (Jyotiba Phule Residential Boys Junior College) డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లగొండ డిఎస్పి శ్రీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత జటిలమైన ఈ సామాజిక రుగ్మత నివారణలో కీలక భాగస్వాములైన విద్యార్థులకు అవగాహన కల్పించడం ఆవశ్యకం అన్నారు. సామాజిక స్పృహ కలిగి విద్యార్థులు సత్ప్రవర్తనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కాంక్షించారు. మత్తు పదార్థాలు యావత్ భారతదేశ యువతను నిర్వీర్యం చేస్తున్న దృష్ట్యా విద్యావంతులు పరిపూర్ణ అవగాహన కలిగి తోటి వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక సమస్యను రూపుమాపడంలో విద్యార్థులు (students)యువత భాగస్వామ్యం చొరవ కీలకం అన్నారు. నేడు యువత సైబర్ అడిక్షన్ తోపాటు సైబర్ క్రైమ్ కు బాధితులుగా మారుతున్న అనేక ఉదంతాలు విద్యార్థులకు వివరించారు. సాంకేతికతను వినోదానికి విధ్వంసానికి కాకుండా అభివృద్ధికి వినియోగించడంలో జాగరుకుతా వహించాలన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్తుని ఉన్నతంగా ఆదర్శవంతంగా మలచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (Mahatma Gandhi University) సహ ఆచార్యులు డా లక్ష్మల మధు, రూరల్ ఎస్సై సైదా బాబు, కళాశాల ప్రిన్సిపాల్ మహేష్, బాడిగల శ్రవణ్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.