“తెలంగాణ ప్రాంత ప్రముఖ్ శివశంకర్ జి*
Sivashankar Ji: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న భౌతిక దాడులను నిరసిస్తూ నల్గొండ పట్టణంలో హిందూ ఐక్యవేదిక నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రాంత ప్రముఖ శివశంకర్ జీ పాల్గొని హిందువులు ఐక్యతతో వుండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని తెలిపారు..
శివశంకర్ జీ మాట్లాడుతూ..
బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై దాడులకు పాల్పడుతూ ఒక లక్ష ఇరవై వేల ఇండ్లను ధ్వంసం చేశారని , బంగ్లాదేశ్ ను ఇస్లాం దేశంగా లక్ష్యంగా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు నిత్యం హిందువులపై అనేక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు..
మన దగ్గర ఉన్న కొంతమంది హిందువులు ఇలాంటి సంఘటనలు జరిగిన ఇంకా మేల్కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
హైదరాబాదులో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతే దాడి చేసినటువంటి వ్యక్తికి మతిస్థిమితం లేదని ఇక్కడ ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని తెలంగాణలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కూడా హిందువులకు సహకరించట్లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ ప్రముఖులు బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అనేకమంది హిందువులు పాల్గొన్నారు…