SP Ramulu Naik: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అక్టోబర్ 21 నుంచి 31 వరకు నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ (Commemoration of Police Martyrs) వారోత్సవాలలో బాగంగా బుధవారం జిల్లా యస్.పి ఆదేశాల మేరకు అమరవీరుల త్యాగాలను, స్మరిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ (SP Ramulu Naik) ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిం ది.ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల విద్యార్దిని, విద్యార్థు లకు (Students) పోలీస్ సిబ్బంది నిర్వహించే విధులు,విది నిర్వహణలో ఉప యోగించే ఆయుధాలు,బాంబ్ డిటెక్టర్ పరికరాలు, పోలీస్ డాగ్స్ వాటి పనీతీరును, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్, షీటీమ్, భరోసా, కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సం బంధిత అధికారులు సిబ్బంది విద్యార్దిని,విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సైబ ర్ నేరాల వలలో (cyber crime) పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు,మిషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల సేవిం చడం వల్ల కలిగే ఆరోగ్య సమస్య లు భవిష్యత్తులో జరిగే పరిణామా ల పై,అలాగే డయల్ 100 ల ఉపయోగం సిసీటీవీల ప్రాముఖ్యత పైన పోలీస్ కళా జాత బృందం ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బి డియస్పి రమేష్,ఏ.ఆర్ డి.యస్.పి శ్రీనివాస్, ఆర్. ఐ లు,సంతోష్, శ్రీను,ఆర్.యస్.ఐ లు కళ్యాణ్ రాజ్, రాజీవ్,సాయిరాం, నాగ రాజు,శ్రావణి,మమత, సిబ్బంది, విద్యార్దిని,విద్యార్దులు పాల్గొ న్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
